Thursday, 30 July 2026 09:29:13 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

MACHARLA HARI PRASAD

Date : 25 May 2023 04:44 PM Views : 362

Famous TV - ఆరోగ్యము / : రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. మొన్నా మధ్య రెండు రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు,విరోచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. సహజంగా మనిషి రోజుకు 7-8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది.

సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయట పనులు చక్కబెట్టుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్‌ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమట పొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు స్నానం చేయాలి. తోలుతో చేసిన చెప్పులు వేసుకోవాలి. బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడి చేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాలు తినకూడదు. నూనే తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది. అన్నం తిన్నాక చివరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి.

ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తినాలి. లేదా గాజు గ్లాసులో మూడు వంతుల నీళ్ళను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం ఖండ శక్కర (మిశ్రి ) వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా త్రాగితే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది. ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. నేరుగా తినలేని వారు రుచి కోసం కొంచెం చక్కర కలుపుకుని తినవచ్చు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: