Sunday, 19 April 2026 05:34:08 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఈఎస్ఐ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపి గురుమూర్తి

Date : 18 August 2023 08:07 PM Views : 455

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి ఈరోజు తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులను మరియు సిబ్బందిని అడిగి సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా హాస్పిటల్ సిబ్బంది పలు సమస్యలను ఎంపి దృష్టికి తీసుకు వచ్చారు. రాయలసీమలో ఉన్న ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ కావడంతో అత్యాధునిక వైద్య చికిత్స పరికరాలను ఏర్పాటు చేయవలసిన అవశ్యకత గూర్చి వారు ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈఎస్ఐ హాస్పిటల్ లోని అత్యాధునిక వైద్య పరికరాలు, మెషినరీ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ లో పలుమార్లు సమస్య గూర్చి చర్చ లేవనెత్తిన విషయం అందరికీ విదితమే. అలాగే చుట్టు పక్కల జిల్లాలకు ఏకైక ఈఎస్ఐ హాస్పిటల్ అయిన తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా గుర్తించి ప్రస్తుతం 50 పడకలతో సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా విస్తరించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపి గురుమూర్తి తెలియజేశారు. అలాగే మంచినీటి సమస్య గూర్చి ప్రస్తావించగా ఇప్పటికే అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్ ని వినియోగం లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటామని తెలియజేశారు. అక్కడ పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని గత దశాబ్ద కాలంగా జీత భత్యాలలో మార్పు లేకుండా ఉందని ఎంపి దృష్టికి తీసుకు రాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :