Tuesday, 15 September 2026 09:13:02 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తిద్దాం...... క్యాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కొందాం

Date : 05 March 2024 04:43 PM Views : 567

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే ఎస్ వి వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి, మరియు ప్రసూతి వైద్యశాల, ఉద్యోగులందరికీ క్యాన్సర్ మీద అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం మంగళవారము ఎస్ వి వైద్య కళాశాల, ప్రసూతి ఆసుపత్రి నందు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్య విద్య సంచాలకుల ఆదేశాలతో, ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ మీద ఉచిత వైద్య శిబిరము మరియు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అంటే అదేదో భయభ్రాంతులో చెంది ప్రాణాలు కోల్పోతామని భయం ఆందోళనలో బతకాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు , అందుకు కావాల్సి చికిత్స మరియు మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి. మహిళలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లయితే వారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే అవకాశాలు , జీవితకాలం ఆనందంగా జీవించడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన క్యాన్సర్ లక్షణాలు : 1). నోటిలో పుండ్లు లేదా గడ్డ 2). ఆహారం తీసుకోవడంలో కష్టం లేదా మింగుతున్నప్పుడు కష్టం రావడం. 3). నెలసరిలో రక్తస్రావం అధికంగా రావడం లేదా నొప్పి 4). మూత్ర విసర్జన, మలవిసర్జనలో మార్పులు రక్తస్రావం 5). ఎడతెగని దగ్గు లేదా స్వర పేటిక (గొంతు)లో మార్పులు 6). శరీరంలో వివిధ భాగాలలో గడ్డలు 7). చర్మంపై మచ్చలు ఆకస్మికంగా పెరగడం రంగు మారడం 8). వక్షజాలలో గడ్డలు ఏర్పడడం, చను మొనలనుండి రక్తం కారడం మొదలగు సూచనలన్నీ మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. అందుకొరకు ఇలాంటి చికిత్సలు చేయించుకోవాలని ప్రభుత్వం ఉద్యోగులకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఇందులో దాదాపు 10 నుంచి 15 టెస్టుల వరకు ఉచితంగా చేయించబడును. దానికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. కాబట్టి ప్రతి మహిళ ఉద్యోగులు ఈ వైద్యు శిబిరములో పాల్గొని వారి యొక్క సందేహాలు, రక్త పరీక్షలు అన్నీ కూడా నిపుణులైన వైద్యుల దగ్గర పరీక్షించుకోవాలని వైద్య శిబిరం ప్రారంభిస్తూ ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. ఇవి మహిళల కోసమే కాకుండా మగవారు కూడా ఈ పరీక్షలు చేయించుకున్నట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే దానికి ఈ వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు మహిళలకు కదా అనుకొని పురుషులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మగ ఆడ ఎవరైనా కూడా క్యాన్సర్ పరీక్షల్ని చేయించుకున్నట్లయితే ముందుగానే క్యాన్సర్ సంబంధించిన వ్యాధిని కనుక్కొని మెరుగైన వైద్యం తీసుకున్నట్లయితే వ్యాధి బారిన పడకుండా ఆనందమైన జీవితాన్ని గడపవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్యశాల ఇంచార్జ్ సూపరిటెండెంట్ డాక్టర్ నిర్మలాదేవి, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత సిరిగిరి (అకాడమిక్ ), డాక్టర్ ప్రమీల విభాగాధిపతి, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సునీత, ప్రసూతి ఆసుపత్రి నర్సింగ్ సూపరిటెండెంట్, వైద్యులు వైద్య విద్యార్థులు , వైద్య సిబ్బంది, నాలుగవ తరగతి సిబ్బంది, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: