Monday, 14 September 2026 07:09:07 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

చర్మ వ్యాధుల మరియు సుఖ వ్యాధులకు సంబంధించిన ప్రాంతీయ వైద్య విజ్ఞాన సదస్సు.

Date : 28 April 2024 01:20 PM Views : 785

Famous TV - ఆరోగ్యము / : శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల ఆవరణలో చర్మవ్యాధులు మరియు సుఖ వ్యాధులు పై నిరంతర వైద్య విద్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. ఇందులో రాయలసీమ పరిధి లోని 10 వైద్య కళాశాలలకు చెందిన 100-125 మంది చర్మ వ్యాధి విభాగ పీ జీ వైద్య విద్యార్థులు మరియు అధ్యాపకులు హాజరైనారు. చర్మ శాస్త్రంలో ఇటీవలి పురోగతులు సోరియాసిస్, తామర మరియు మోటిమలు వంటి చర్మ పరిస్థితులకు కొత్త చికిత్సల అభివృద్ధితో సహా వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STDలు) రంగంలో, రోగనిర్ధారణ పద్ధతులు, చికిత్స ఎంపికలు మరియు నివారణ వ్యూహాలలో పురోగతి సాధించబడింది. ఉదాహరణకు, సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీస్ (STD) పరీక్ష యొక్క ఖచ్చితత్వం మరియు యాక్సెసిబిలిటీలో మెరుగుదలలు ఉన్నాయి, అలాగే HIV మరియు హెర్పెస్ వంటి పరిస్థితుల కోసం కొత్త యాంటీవైరల్ ఔషధాల అభివృద్ధి కూడా జరిగింది. అదనంగా, సురక్షితమైన లైంగిక అభ్యాసాలను ప్రోత్సహించడానికి మరియు STDల వ్యాప్తిని తగ్గించడానికి విద్య మరియు అవగాహన ప్రచారాలపై ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ తెలిపారు. ఇందులో డాక్టరు వై యస్ ఆర్ యూనివర్సిటీ మరియు ఏ పీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు గా ప్రొఫెసర్ చిన్న పిల్లల విభాగం డాక్టర్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చర్మ వ్యాధుల నూతన చికిత్స విధానాలను విద్యార్థులకు బోధించారు. విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. డీవీఎల్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ హర్ష వర్ధన్, డాక్టర్ సుమలత, డాక్టర్ రూహి నాజినీన్ తదితరులు బోధించారు, చర్మ వ్యాధి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉష, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ భాను ప్రకాష్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వరి, ఎస్వీ వైద్య కళాశాల పి.ఆర్. ఓ.వీరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: