Famous TV - ఆరోగ్యము / : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పని చేయుచున్న డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ శిక్షణకు గాను ఎస్ వి ఆర్ ఆర్ జి జి హెచ్, ఎస్ వి మెడికల్ కాలేజ్ తిరుపతి డెంటల్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎన్ స్వప్నప్రియ, రిసోర్స్ పర్సన్ గా ఎంపిక చేశారు. డాక్టర్ స్వప్న ప్రియ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయు డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ కి 25 మరియు 26 సెప్టెంబర్ 2023 తేదీన కమిషనర్ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆదేశానుసారం హ్యాండ్స్ ఆన్ కోర్స్ మరియు పేషంట్ పై రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుటకు కావలసిన అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనివలన దంతములు కలుగుతున్న ఇబ్బందులను, దంత వైద్యులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనివలన దంత రోగులకు మెరుగైన వైద్యం అందించవలసింది తెలిపారు. ఇలాంటి శిక్షణలు తీసుకోవడం వలన టీచింగ్ ఆసుపత్రి నందు శిక్షణ పొందినట్లయితే గ్రామీణ దంత వైద్యము, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యం అందించవచ్చు అని అన్నారు. శిక్షణ కార్యక్రమము ప్రారంభోత్సవానికి ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి చంద్రశేఖరన్ , రుయా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ జి రవి ప్రభు, ఎస్వీ మెడికల్ కాలేజ్ అడ్మిన్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ జె రాధా, దంత వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎన్ స్వప్న ప్రియ, (రూట్ కెనాల్ స్పెషలిస్ట్) దంత వైద్య విభాగ వైద్యులు, దంత సిబ్బంది, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV