Famous TV - ఆరోగ్యము / : ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో 2023 వ సంవత్సరపు ఎం. బి.బి.ఎస్. వైద్య విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకమని అన్నారు. ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన వైద్య విద్యను అభ్యసించినట్లయితే సంఘములో పేద రోగులకు మంచి వైద్యం అందించవచ్చునని ఈ సందర్భంగా మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. వైద్య విద్యను అభ్యసించేటప్పుడు ప్రతి ఒక్క రోగిని క్షుణ్ణంగా పరిశీలించి మెరుగైన వైద్యం అందించవలెను. ఈ వైద్య విద్య అనేది నిరంతరం చదువుకుంటూ ఉండవలెను. మెరుగైన వైద్యం అందించడానికి దోహదపడుతుంది, అని విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన తిరుపతిలో సీనియర్ మోస్ట్ వైద్యులు డాక్టర్ రాజా రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరారు. డాక్టర్ రాజారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి 2023వ సంవత్సరపు వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య విద్యను చాలా సంతోషంగా ఆనందంగా అభ్యసించినట్లయితే మెరుగైన వైద్యము పేద ప్రజలకు మనం అందించవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. వైద్యం అందించేటప్పుడు, ప్రతి ఒక్క వైద్యుడు, తన యొక్క వృత్తి ధర్మాన్ని కచ్చితంగా పాటించి గాంధీ తాత, కన్నా కళలను అందించినప్పుడు సంపూర్ణ వైద్యం పేదవాడికి మనం అందించినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వైద్య విద్యార్థి వైద్యంలో పరిశోధనలను , వైద్యంలోని మెలకువలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేకించి 2023 వ సంవత్సరం వైద్య విద్యార్థులు గ్రామీణ ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిందిగా, ఆయన అన్నారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అందించినట్లు అవుతుంది. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మిన్ ), డాక్టర్ వసుంధర దేవి (అకాడమిక్, ), ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి, రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, డాక్టర్ సునీత, డాక్టర్ కిరీటి, డాక్టర్ మాధవి లత, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శశికాంత్ , విభాగాధిపతులు అసోసియేట్ ప్రొఫెసర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఎస్ వి వైద్య కళాశాల సిబ్బంది, మరియు పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV