Monday, 14 September 2026 06:23:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రపంచ జనాభా దినోత్సవ కార్యాక్రమం

డాక్టర్ U.శ్రీ హరి గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,తిరుపతి

Date : 11 July 2023 05:53 PM Views : 445

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ప్రపంచ జనాభా దినోత్సవము: 11.07.2023. డాక్టర్ U.శ్రీ హరి గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యాక్రమం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం,తిరుపతి నుండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ ర్యాలీని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు,డాక్టర్ శ్రీనివాసరావు,డాక్టర్ శ్రీ నివాసులరెడ్డి,డాక్టర్ రూప్కుమార్,హరినాథ్,కిరణ్ నాయక్,జుబేర్,శ్వేత ఎస్వో నాగేంద్ర కుమార్, డిప్యూటీ డెమో కిరణ్ కుమార్, ANMలు,ఆశాకార్యకర్తలతో మరియు నర్సింగ్ విద్యార్థినులతో టౌన్ క్లబ్ వరకు నిర్వహించడమైనది. స్విమ్స్ కూడలి నందు మానవహారము ఏర్పాటు చేసి అందరిచే ప్రతిజ్ఞ చేయించడమైనది.ఈ సందర్భముగా డాక్టర్ శ్రీ హరి గారు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,తిరుపతి వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరిగిపోతున్నదని,తద్వారా తలెత్తే దుష్పరిణామాలను నివారించేందుకు,అధిక జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జూలై 11వ తేదిన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల,తగ్గుకు సంబంధించిన వపత్రిక ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్య సమితి 1987 వ సంవత్సరం జూలై 11 వ తేదిని ప్రపంచ జనాభా దినోత్సవముగా జరుపుకోవాలని ప్రకటించిందని,142కోట్ల జనాభాతో ప్రపంచంలో మన దేశము మొదటి స్థానంలో ఉందని,ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరము (2023) కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు “స్వాతంత్ర్య అమృత మహోత్సవం పురస్కరించుకుని కుటుంబ సంతోషం మరియు శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిద్దాం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేస్తోందని”పేర్కొన్నారు.చిన్న కుటుంబం యొక్క ఆవశ్యకతను తెలియజేసి కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్దతులు మరియు శాశ్వత పద్దతులపై అర్హులైన దంపతులకు (EC) అవగాహన కార్యక్రమములు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. మొదటి దశలో జనాభా సమీకరణ పక్షోత్సవాలు 27.06.2022 నుండి 10.07.2022 వరకు,రెండవ దశలో జనాభా స్థిరీకరణ పక్షోత్సవాలు11.07.2022 నుండి 24.07.2022 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివాహ వయస్సుపైన, కుటుంబ నియంత్రణ పద్దతులపైన,బిడ్డబిడ్డకు ఎడం పైన,అవగాహన కల్పించి తల్లిబిడ్డ సురక్షితంగా ఉండేలా మరియు మాతృమరణాలు, శిశుమరణాలు జరగకుండా చర్యలు చేపట్టాలనే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్దతులైన ఓరల్ పిల్స్(మాల-N),ఛాయ నోటి మాత్రలు,ఈ.జి.పిల్,అంతర ఇంజెక్షన్లు మరియు నిరోధ్, పి.పి.ఐ.యు.సి.డి,కాపర్ - T లాంటి పద్దతులపై అర్హులైన దంపతులకు క్షేత్ర స్థాయిలోని వైద్యాధికారులు,వైద్య సిబ్బంది, ANM, ASHA, అంగన్వాడి కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించి దంపతులు పై పద్దతులను వాడేలా ప్రోత్సహించడం ఈ సంవత్సరం ప్రపంచ జనాభా మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ప్రతి కుటుంబ సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయం.చిన్న కుటుంబం - చింతలేని కుటుంబం. - జనాభా నియంత్రణ అందరి ముఖ్య కర్తవ్యం.. - దేశ ప్రగతి, అభివృద్ది, సంక్షేమం,ఆర్థిక స్వాలంభన లక్ష్యాల సాధన మనందరి భాద్యత.. - కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించడం – దేశ జనాభాను అరికట్టడం మన సంకల్పం..అనే నినాదాలతో ర్యాలీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యస్.వి ఆర్ ఆర్ నర్సింగ్ కాలేజిల విద్యార్థినులు మరియు ఇతర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: