Wednesday, 29 July 2026 06:32:31 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

వైద్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్

Date : 17 June 2024 05:11 PM Views : 806

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : మొట్టమొదటిసారి మంత్రిగా ,వైద్య అరోగ్య శాఖామాత్యులుగా ప్రమాణ స్వీకారం చేసుకుని, భాద్యతలని నిన్నటిరోజు స్వీకరించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం తిరుమల కి కుటుంబ సమేతంగా విచ్చేశారు. మొట్టమొదటిసారిగా రుయా ఆస్పత్రి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రుయా ఆసుపత్రి లోపల మొదటగా అత్యవసర విభాగ వార్డును ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను అక్కడ అందుతున్న వైద్యం గురించి, వైద్యులు వైద్యం అందిస్తున్న తీరును గురించి, నర్సింగ్ సిబ్బంది నాలుగో తరగతి సిబ్బంది, వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి మెరుగైన వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ఓపి విభాగమునకు వెళ్లి ఓపి చీటీలు పొందే దగ్గర ఏవైనా సాంకేతిక ఇబ్బందులు కలుగుతున్నాయ, అక్కడ క్యూ లైన్ లో ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, వైద్యం కోసం అక్కడికి వచ్చిన రోగులు రుయా ఆసుపత్రి నందు మెరుగైన వైద్యం అందుతున్నదని, వారికి కావలసిన మందులు కూడా విరివిగా, అందుబాటులో ఉన్నాయని రోగులు, ప్రజలు మంత్రికి సంతోషపూరకంగా తెలిపారు. ఈ ఎన్ డి ఏ ప్రభుత్వంలో ఇప్పుడు మాకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలకు చెందిన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తదుపరి జనరల్ మెడిసిన్ విభాగమునకు వెళ్లి ఇన్ పేషంట్ రోగి వారి సహాయకులను ఇక్కడ అందుతున్న వైద్యం గురించి, కొద్దిసేపు వార్డు లోపలికి వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్లు ఉన్న సిబ్బంది, ఇక్కడ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, చిరునవ్వుతో మమ్మల్ని పలకరించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు . సంతోష వ్యక్తపరిచారు. ఆరోగ్యశాఖ మంత్రి రోగి సహాయకులతో , కొద్దిసేపు వార్డు నందు ఆసుపత్రిలో ఉన్న లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగి సహాయకులు ఎండాకాలంలో కొద్దిపాటి నీటి సమస్య కలుగుతున్నదని , అది మెరుగుపరిచినట్లయితే రుయా ఆసుపత్రి ప్రైవేట్ ఆస్పత్రుల కన్నా మెరుగ్గా ఉంటుందని మంత్రికి తెలిపారు. మంత్రి వెంటనే సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ను పిలిచి నీటి సమస్య రాకుండా, రోగులకు వారి సహాయకులకు నీటిని అందుబాటులో ఉంచాలని, అందులో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే, వెంటనే నీటి ఎద్దటిని, దానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని రుయా సూపర్నెంట్ గా తెలిపారు. రుయా ఆసుపత్రికి రేడియాలజీ డిపార్ట్మెంట్ ను మెరుగుపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా రుయా సూపర్నెంట్ సమావేశ మందిరంలో మంత్రిగారు కొద్దిసేపు వైద్యులతో, ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖరన్, డిప్యూటీ సూపర్నెంట్ డాక్టర్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరితో కొద్దిసేపు రుయా ఆసుపత్రి అభివృద్ధి గురించి చేయవలసిన పనుల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం, మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం పేద రోగుల కొరకు, వైద్యములో, వైద్య విద్యలో, పెనుమరుపులు తీసుకుని వచ్చి ఇటు పేద రోగులకు, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు , మెరుగైన వైద్యం అందించడానికి పెద్దపీట వేస్తున్నట్టు అయినా తెలిపారు. త్వరలో రుయా ఆసుపత్రికి పేద రోగుల కొరకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే విధముగా ముందుకు తీసుకొని వెళ్లే ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రుయా ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. రుయా సూపరిటెండెంట్ కు, ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు, నర్సింగు , పారామెడికల్, నాలుగవ తరగతి సిబ్బందికి పేద రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్న వారికందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన విషయాలు అన్ని కూడా కూలంకసంగా చర్చించుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు , తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుదేశం నాయకులు, బిజెపి నాయకులు , భాను ప్రకాష్ రెడ్డి, చిట్టిబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, అజయ్ కుమార్, జనసేన నాయకులు,రుయా ఆసుపత్రి నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, నాలుగవ తరగతి సిబ్బంది మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: