Wednesday, 29 July 2026 11:32:47 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

స్విమ్స్ ఆవరణలో మౌలిక సదుపాయాలపై టిటిడి దృష్టి సారించాలి!

Date : 02 July 2023 01:26 PM Views : 387

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : 1) స్విమ్స్ క్యాజువాలిటీ (అత్యవసర విభాగం) లో ప్రాణాపాయ స్థితిలో ట్రీట్మెంట్ కొరకు వచ్చే రోగులకు బెడ్లు అందుబాటులో లేక స్ట్రక్చర్లపై, వీల్ చైర్స్ లో,అంబులెన్స్ లలో వైద్యం కోసం రోగులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఆరోగ్యం కుదుటపడిన రోగులను వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ వార్డులకు షిఫ్ట్ చేసేలా చూడాలి! 2) సిమ్స్ క్యాజువాలిటీలో, వార్డులలో అడ్మిట్ అయిన రోగుల సహాయకులను సెక్యూరిటీ సిబ్బంది ఆవరణ ప్రాంగణంలో నుంచి బయటకు పంపిస్తుంటారు చెట్లకింద,ఫుట్ పాత్ లపై ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అనేక ఇబ్బందులు పడుతుంటారు రోగుల సహాయకుల సౌకర్యార్థం పురుషులకు మహిళలకు విడివిడిగా 100 మంది సరిపోయేలా 2 డార్మెటరీ హాల్స్,అందులో కొన్ని మరుగుదొడ్లు,స్నానపు గదుల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలి! 3) టిటిడి ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు ఉచితంగా రెండు పూటలా సాంబారు, పెరుగు అన్నం రుచిగా అందిస్తున్నారు కానీ కూర్చొని భోజనం చేసేందుకు బెంచీలు లేకపోవడంతో రోడ్లపై ఫుట్ పాత్ లపై కూర్చొని తింటున్నారు,సహాయకులకు సరిపడేలా మంచినీటి సౌకర్యం కూర్చుని తినేలా రేకుల షెడ్డు ఏర్పాటుపై దృష్టి సారించాలి! 4) స్విమ్స్ ప్రాంగణంలో ప్రైవేటు మెడికల్ మాఫియాను సాగనంపి టిటిడి ఆధ్వర్యంలో మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలి అలాగే టిఫిన్ భోజనం కాంటీన్లను ఏర్పాటు చేసి సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని రోగుల సహాయకులకు అందించేలా చర్యలు చేపట్టాలి! 5)స్విమ్స్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వైద్యులను, మెడికల్ నాన్ మెడికల్, నర్సులతోపాటు సిబ్బందిని రెగ్యులర్ చేస్తూ జీతాలు పెంచి ఇచ్చేలా టిటిడి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను!

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :