Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఆదివారం ఎస్ వి వైద్య కళాశాల,రుయా ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం, లో( ఐ ఏ పి) అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (IAP ALS ) రెండు రోజుల వర్కుషాప్ ( నిన్న + ఈరోజు ) జరిగినది. ఈ వర్క్ షాప్ పిల్లలలో అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను శాస్త్రీయంగా, ఆధునిక పద్ధతుల తో, మెలుకువలతో, అనుసరించవలసిన ప్రోటోకాల్ పద్ధతులను తెలుపుతూ, ఈ వర్క్ షాప్ నందు వైద్యులకు ఎలా వైద్యం చేయాలో వివరించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నకు ఎస్ వి వైద్య కళాశాల పీడియాట్రిక్ విభాగం , పి ఈ ఎస్, వైద్య కళాశాల కుప్పం, ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు, కిమ్స్ (KIMS) కర్నూలు, అంకురా హాస్పిటల్ పీడియాట్రిక్ పీజీ వైద్య విద్యార్థులు, రుయా వైద్యులు డా పద్మిని, డా పద్మజా రాణి( దాదాపు 40మంది ) పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డా శశికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, జాతీయ ఉపన్యాసకులు ఆచార్య సుధాకర్ , రాష్ట్ర కోఆర్డినేటర్ డా. రామప్రసాద్, డా హేమకుమార్, రెయిన్బో హాస్పిటల్ విజయవాడ, డా వాసు కిమ్స్ కర్నూలు, డా కిరీటి, డా శశి కుమార్ పాల్గొన్నారు.
Admin
Famous TV