Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాపానాయుడుపేట డాక్టర్ పి హర్షవర్ధన్ సార్ అధ్యక్షతన ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, గోవిందవరం గ్రామం నందు డాక్టర్ సి అభిజ్ఞ మరియు డాక్టర్. సాయి హరిణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో 102 మంది పేషంట్ల హాజరైనారు . వీరిలో 21 మంది కి మధుమేహం మందులను పంపిణీ చేశారు. 16 మంది రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది .నలుగురు గర్భవతులకి ఈసీజీ పరీక్షలు చేశారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగినది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నందు తొమ్మిది రకాల పరీక్షలు, 73 రకాల మందులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేటర్ ఎం.టాటా బాయ్ మాట్లాడుతూ రుతుక్రమం పై ఉన్న అపోహలను తొలగించి సరైన ఆహార నియమాలు వ్యక్తిగత శుభ్రతలు పాటించడం వలన రుతుస్రావ సమస్యలు తగ్గుతాయని మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మంజుల సిహెచ్ఓ రమా ఏఎన్ఎం ఆశాలు పాల్గొన్నారు
Admin
Famous TV