Monday, 14 September 2026 10:21:31 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

డబ్బు కొట్టు ఉద్యోగం పట్టు, ఆశా కార్యకర్త పోస్టుకు రెండు లక్షలు

Date : 30 August 2025 05:33 PM Views : 820

Famous TV - ఆరోగ్యము / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని కొన్ని పంచాయతీలకు ఆశ వర్కర్లు పోస్టులు భర్తీ చేసే నేపథ్యంలో గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఒక ఆశ కార్యకర్త ప్రధాన సూత్రధారిగా లంచావతారమెత్తి ఒక్కొక్క పోస్టుకు లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా డబ్బులు వసూలు చేసి మ్యానిప్లేట్ చేసింది. చౌడేపల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆశ కార్యకర్త ఆవిడ భర్త ఇద్దరూ కలిసి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో లాబీయింగ్ చేసి ఎటువంటి అర్హత లేని వాళ్లకు ఆశ కార్యకర్త పోస్టులను ఇప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో మండలంలోని పెద్ద యల్లకుంట్ల గ్రామపంచాయతీకి చెందిన గతంలో పనిచేసిన ఆశ కార్యకర్త లక్ష్మీదేవి చనిపోగా ఆవిడ స్థానంలో కొత్తగా నియామకం చేపట్టారు.ఈ నియామకానికి ప్రభుత్వం నుండి కొన్ని అర్హతలను ఏర్పాటు చేయడమైనది.అందులో భాగంగా విద్యార్హత పదవ తరగతి పాసై ఉండాలి.వయస్సు 24 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి అదే గ్రామపంచాయతీకి చెందిన కోడలై ఉండాలి లేదా అదే గ్రామపంచాయతీలో కాపురం ఉండాలి అనే నిబంధనలతో దరఖాస్తులు సమర్పించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఆరు మంది దరఖాస్తు చేసుకోవడమైనది. అందులో అదే గ్రామపంచాయతీకి చెందిన వారికి కాకుండా చౌడేపల్లి మండలం నాయినివారిపాలెం కి చెందిన హాసిని అనే మహిళకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది.హాసిని స్వగ్రామం చౌడేపల్లి పట్టణమునందు గల నాయునివాయుపాళెం. ఆవిడ పెద్దయల్లకుంట్ల గ్రామపంచాయతీ చెడుగుట్లపల్లి చెందిన ప్రకాష్ అను వ్యక్తిని వివాహం చేసుకొని అతడిని ఇల్లురికం తెచ్చుకుందని,తన పుట్టింటిలోనే కాపురం చేస్తున్నదని.ఈ నేపథ్యంలో చౌడేపల్లి మండలంలో ఒక మాజీ సర్పంచ్,ఒక ఆశ కార్యకర్త లాబీయింగ్ చేసి సుమారు రెండు లక్షలకు ఆశ కార్యకర్త పోస్టును తీసి ఇవ్వడం జరిగింది.అంతేకాకుండా అర్హతపరంగా చూసుకుంటే హాసినికి ప్రస్తుతం వయస్సు 21సంవత్సరాలు మాత్రమే. అంతేకాకుండా ఆవిడ ప్రస్తుతం చౌడేపల్లి పట్టణంలో నివాసం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సైతం ఈ విధముగా అమ్ముకుంటున్న వాళ్లపై చట్టయ్య చర్య తీసుకుని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ధరఖాస్తుదారులు వేడుకుంటున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: