Monday, 14 September 2026 10:23:23 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ ర్యాలీ

Date : 10 October 2023 06:24 PM Views : 602

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : 10.10.2023, తిరుపతి ఎస్ వి. వైద్య కళాశాల *** సోమవారం ఎస్వీ వైద్య కళాశాల మరియు రుయా ఆసుపత్రి , మానసిక విభాగము వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ మరియు పారామెడికల్ విద్యార్థులు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO),గణంకాల ప్రకారం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నేడు శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం అతి ముఖ్యమైన అంశంగా పరిగణించాల్సిన అవశ్యకత ఉంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ మానసిక వైద్యం అందరికీ అందే వనరుగా సమకూర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మానసిక విభాగాధిపతి ఇంచార్జ్ డాక్టర్ మల్లికార్జున రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి విభాగం అందుబాటులో ఉంటుందని ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు,మానసిక కలతులు చెందినప్పుడు, మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే , మెరుగైన వైద్యము కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, మాదకద్రవ్యాలు తీసుకునే వారికి కౌన్సిలింగ్, అందించి, వారికి మెరుగైన వైద్యం అందించడంలో ఎంతో దోహదపడుతుందని ఈ మానసిక వైద్య విభాగము అందుబాటులో ఉంటుందని అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి అన్ని విధాల సహాయ సహకారాలు, మెరుగైన వైద్యం అందిస్తూ మా వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, మాట్లాడుతూ మానసిక వైద్యం అందుకోవడంలో ఏ విధమైన సంకోచం లేకుండా వైద్యం అందుకున్నట్లయితే దానితోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ , ఇతరత్రా కౌన్సిలింగ్ లు తీసుకున్నట్లయితే సంఘంలో మీరు ఉత్తమమైన మనిషిగా నిలవడానికి మానసిక వైద్యం ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ వి.వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మిన్) డాక్టర్ సునీత (అకాడమిక్ ), డాక్టర్ జాహ్నవి, డాక్టర్ భారతి, డాక్టర్ కవిత, పీజీ, యూజీ వైద్య విద్యార్థులు, డి అడిక్షన్ సెంటర్ కౌన్సిలర్లు, డాక్టర్ ముకుంద నాయుడు, డాక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: