Monday, 14 September 2026 08:00:43 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎస్వీ వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల DPL (డాక్టర్స్ ప్రీమియర్ లీగ్) పెవిలియన్ ప్రారంభోత్సవం

Date : 04 April 2024 06:33 PM Views : 709

Famous TV - సామాజిక సేవ / : గురువారము ఎస్వీ వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు , నారాయణాద్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డా.సునంద కుమార్ రెడ్డి అందించిన సహాయంతో నిర్మించిన నారాయణాద్రి పెవిలియన్ ఆర్చ్ ప్రారంభోత్సవం మరియు సమర్పణ. సుమారు రూపాయలు 15 లక్షలు విలువ గలిగిన నిర్మాణాన్ని ఈరోజు ఎస్వీ వైద్య కళాశాలకు వితరణ చేయడం జరిగినది. ఈ ఆర్చ్ నిర్మాణం డాక్టర్ తులసీరామ్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, ఎస్ వి వైద్య కళాశాల , డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ ( DPL ) పెవిలియన్ మరియు భాను (APSMIDC) వారి కృషితో నిర్మించబడిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు నారాయణాద్రి హాస్పిటల్‌కి అప్పగించబడుతున్న సందర్భంగా , గౌరవ సూచకంగా ఎస్ వి వైద్య కళాశాలకు అందించడం జరుగుతుంది. ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్, డా.పి.ఎ.చంద్రశేఖరన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, పారామెడికల్ మరియు ఆఫీస్ సిబ్బంది, తదితరులు అందరూ వివిధ ఆట పోటీలు, ఎస్ వి వైద్య కళాశాల క్రీడా మైదానంలో వివిధ ఆట పోటీలు నిర్వహించడానికి అనుకూలంగా, దీన్ని ఆహ్లాదించడానికి టీమ్స్ ని ఎంకరేజ్ చేయడానికి పెవిలియన్ ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, అదనపు సూపర్డెంట్ డాక్టర్ సుబ్బారావు, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సత్యనారాయణ మూర్తి వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ ఫాహీమ్, డాక్టర్ మదన్, మదర్ హాస్పిటల్, డాక్టర్ శ్రీధర్ శ్రీ హాస్పిటల్, డాక్టర్ చరణ్ సింగ్ మాజీ ప్రిన్సిపాల్ పద్మావతి మహిళా వైద్య కళాశాల, ఫిజికల్ డైరెక్టర్ శరవణ, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో, వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: