Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం బీరవల్లి ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ బాల్య వివాహాలను నిర్మూలిద్దాం బాలిక విద్యను ప్రోత్సహిద్దాం అనే కార్యక్రమం పై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలో అందరూ సమిష్టి కృషి చేసి తల్లిదండ్రులను చైతన్యం చేయాలని బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు బాలికల విద్య వలన కలుగు లాభాలను వివరించారు పాఠశాల హెచ్ఎం ఆర్ హుస్సేన్ భాష మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు విద్యలోనూ ఉద్యోగాలలోను రిజర్వేషన్లు కల్పించాలని వివరించారు ఆ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆర్ హుస్సేన్ భాష ఉపాధ్యాయుడు నాగేంద్రుడు గ్రామస్తులు వాసు రాయుడు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు
Admin
Famous TV