Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం దేవ నగర్ ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో వేసవి జాగ్రత్తలపై కరపత్రం విడుదల పంపిణీ విద్యార్థులకు బహుమతులు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు పెద్దలు గాని పిల్లలు గాని అత్యవసరమైతేనే బయటికి రావాలని ముఖ్యంగా పిల్లలను ఈతకు ఒంటరిగా పంపవద్దని తెలిపారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే వడదెబ్బ పట్ల తీసుకోవాల్సిన నివారణ చర్యలు బ్రహ్మానంద చారి వివరించారు పాఠశాల హెచ్ఎం కే హుస్సేన్ వలి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కే బాల గురువారెడ్డి తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు మద్దిలేటి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు కరపత్రాల పంపిణీ చేయడం జరిగినది
Admin
Famous TV