Sunday, 13 September 2026 04:38:48 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా రక్త దానం చేసిన జనరల్ సర్జన్స్

Date : 06 April 2024 04:14 PM Views : 724

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : శనివారము ఎస్ వి. వైద్య కళాశాల రుయా ఆసుపత్రి రక్త నిధి కేంద్రం నందు ఏప్రిల్ 07 ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా, రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి. రవి ప్రభు ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వారు ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా పేద ప్రజల కొరకు, వారికి వైద్యంలో అందవలసిన రక్తం నిల్వలను అదనంగా రుయా ఆసుపత్రికి వైద్యులుగా ఉండి ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది, అందరూ కూడా రక్త దానం చేయడం వలన చాలా ఆరోగ్యంగా జీవించడానికి, కొందరి ప్రాణాల ను కాపాడు వచ్చునని రక్తదాన శిబిరమునకు వచ్చిన డాక్టర్లను ఉద్దేశించి రుయా ఆసుపత్రి సూపరిటాండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా డాక్టర్ పివి రమణ మూర్తి, ఎఫ్. ఆర్.సి.ఎస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, విశాఖపట్నం, మరియు కోశాధికారి డాక్టర్ ఎం.ఏ హరిబాబు, తిరుపతి, వారి ముఖ్య ఉద్దేశంతో , ప్రపంచ ఆరోగ్య దినం రోజు పేద ప్రజల కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేసి వాళ్లకి చేదోడుగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వారి పిలుపు మేరకు రుయా ఆసుపత్రి సర్జన్ స్ విభాగం నందు పనిచేస్తున్న డాక్టర్లు, అసోసియేషన్ సభ్యులు, రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగినది, దాదాపు 35 నుండి 45 యూనిట్లు రక్తం, రుయా ఆసుపత్రి రక్తనిధికి ఉచితంగా రక్తం సేకరించడం జరిగినది. ఈ సందర్భంగా రక్త దానం చేసిన వారికి ప్రశంస పత్రము, చల్లని పానీయాలు, రుయా రక్త నిధి విభాగం వారు ఇవ్వడం జరిగినది. ఈ విధంగా రక్తదానం చేసిన వాళ్లు పేద ప్రజలకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారని రక్త నిధి ఇన్చార్జ్ వైద్యాధికారి డాక్టర్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రుయా ఆస్పత్రి ఏ.ఆర్.ఎం.ఓ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ సోమశేఖరయ్య, డాక్టర్ ప్రవీణ్, మల్లికార్జున, శేఖర్ యాదవ్, ధరణిధర్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: