Famous TV - తెలంగాణ / : తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు తెలంగాణ ప్రజలు. హస్తం పార్టీకి అవకాశం కల్పించారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ అయితే గెలిచింది కానీ.. సీఎం ఎవరు అని తేల్చడానికి ముందు హైకమాండ్‌కు రెండు రోజులు పట్టింది. అనేక చర్చోపచర్చల తర్వాత... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని తేల్చింది. తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండు అంటే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టగానే.. తాను ఏ ఫైల్ పై సంతకం చేస్తారో ముందుగానే చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీనిపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలపైనే ఆయన తొలి సంతకం పెడతానని గతంలో చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించిన తర్వాత రోజు నుంచి కేసీఆర్ కనిపించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలను చూసిన కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని చెప్పారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ పనిచేస్తారో లేదో చూడాలి. కాంగ్రెస అధికారంలోకి వస్తే తమకు గ్యాస్ సిలిండర్ రూ.500కే వస్తుందనిమహిళలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రేవంత సీఎంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 7న ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది, అయితే సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.
Admin
Famous TV