Wednesday, 29 July 2026 04:05:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..

Date : 10 June 2023 02:57 PM Views : 344

Famous TV - తెలంగాణ / : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్‌ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగసభల పేరుతో జనంలోకి వెళ్తోంది. తాజాగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని రేవంత్​ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నేతలంతా కష్టపడాలన్నారు.. ధరణి పోర్టల్ గడీల పాలన కోసం తెచ్చారని ఆయన ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసమేనని.. ఆ భూముల మీద దొరల పెత్తనం ఆగకపోతే నక్సల్ బరి ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టణ బాట పట్టిన దొరల కోసం ధరణి కేసీఆర్‌ ధరణి తెచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. కొత్త భూస్వాములను తయారుచేసేందుకే.. ధరణి. రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో లేదని ఆయన విమర్శించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ దళారుల చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. ధరణి ద్వారా హైదరాబాద్‌ చుట్టూ భూములు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దోచుకున్న భూములను బినామీ పేర్లపై ఉంచారని రేవంత్ అన్నారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని అంటూ రేవంత్ మండిపడ్డారు. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా కలసికట్టుగా కష్టపడాలని రేవంత్‌ సూచించారు..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :