Monday, 14 September 2026 07:06:55 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రహదారుల ఆధునీకరణ కోసం బి.ఎస్.పి. పార్టీ ధర్నా

అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లైనా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ కాలమేల్ల దీస్తున్న ఎం.ఎల్.ఏ.క్రాంతి _డా.ముప్పారంప్రకాశం బి.ఎస్.పి. ఇంచార్జి, అందోల్

Date : 26 June 2023 04:55 PM Views : 404

Famous TV - తెలంగాణ / : పనులు చేసే గుత్తేదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యకపోవడం వల్ల కుంటుబడిన అందోల్ అభివృద్ధి అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లైనా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ కాలమేల్ల దీస్తున్న ఎం.ఎల్.ఏ.క్రాంతి _డా.ముప్పారంప్రకాశం బి.ఎస్.పి. ఇంచార్జి, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం జూన్ 26, 2023 సంగారెడ్డి: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రహదారుల ఆధునీకరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ "బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)" అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి డా.ముప్పారంప్రకాశం ఆధ్వర్యంలో నేడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు ఆర్ అండ్ బి ఎస్.ఇ. కార్యక్రమం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పారంప్రకాశం మాట్లాడుతూ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల రోడ్లు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి మరమత్తులు చేయని కారణంగా వాహనాలే కాదు మనుషులు సైతం నడవలేనంత దారుణంగా దెబ్బతిన్నాయని, వాటిని బాగుచేయడం కోసం ఒక్క గుత్తేదారు ముందుకు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చెయ్యకపోవడం ప్రధానకారణం అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హరీష్ రావు, కే.తరకరామరావ్ ల నియోజకవర్గల్లో అభివృద్ధి జరుగుతే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు కాదని, ఎంత కాలం గత ప్రభుత్వాన్ని, మాజీ ఎమ్మెల్యేలను నిందిస్తూ ఉంటారని, ఈ తొమ్మిది సంవత్సరాలుగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు చేతకాదని తేలిపోయిందని, అందోల్ ప్రజల సంక్షేమం కోసం బి.ఎస్.పి. కట్టుబడి ఉందని, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సారధ్యంలో రాబోయే ఎన్నికల్లో బిఎస్పి విజయం సాధించి ప్రజల కష్ట పంచుకుని పరిష్కారిస్తుందన్నరు. ఈ ధర్నా కార్యక్రమం అనంతరం డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని రోడ్లు భవనాల శాఖ ఎస్సీ, జిల్లా రెవెన్యూ అధికారి మంచి నగేష్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి చాంద్ పాషా, అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, నాయకులు పద్మారావు, ప్రేమ్ కుమార్, కిరణ్ కుమార్, ప్రకాష్, విజయ్, సురేష్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: