Monday, 14 September 2026 07:07:24 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఆదర్శ కళా నిలయం వ్యవస్థాపకుడు చేరాల ప్రకాష్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

Date : 29 July 2023 09:39 PM Views : 713

Famous TV - తెలంగాణ / Hyderabad : హైదరాబాద్, బ్యూరో ఇంచార్జీ అక్షర దివిటీ: ప్రముఖ జానపద గాయకుడు, రచయిత, ఆదర్శ కళా నిలయం వ్యవస్థాపకుడు చేరాల ప్రకాష్ కు గౌరవ డాక్టరేట్ వరించాంచింది. తమిళనాడు కు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యునివర్సిటీ కళా, సేవా రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ శనివారం తమిళనాడు లోని హుసూర్ అందజేశారు. ఆదర్శ కళా నిలయాన్ని స్థాపించి గత 26 సంవత్సరాలుగా వేల సంఖ్యలో కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, జానపద నృత్య కళా కారులను ప్రోత్సహించడంతో పాటు తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను ఆయనను గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేశారు. ప్రకాష్ జానపద గాయకునిగా, రచయితగా, షార్ట్ ఫిలిం దర్శకునిగా సమాజానికి ఉపయోగపడే విధంగా తమ కార్యక్రమాలను రూపొందించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆదర్శ కళానిలయం వ్యవస్థాపకుడు చేరాల ప్రకాష్ కు గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేయడంతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ అడ్వైజరీ బోర్డు ఫౌండర్ అండ్ హెడ్ కోచ్ విజయన్ అకాడమీ మాస్టర్ వి బాబు విజయన్, తమిళనాడు ఐ ఎన్ టి యు సి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే ఏ మనోకరన్, శ్రీ శ్రీ రాజశేఖర్ స్వామీజీ, డాక్టర్ ఎస్ నారాయణ, డాక్టర్ సీఎం పంచ శేఖరయ్య, మంజు డాక్టర్ గుణవంత మంజు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :