Saturday, 13 June 2026 10:55:54 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

రాబోయే ఎన్నికల్లో బిఎస్పి బలాన్ని చూపిస్తాం

బిఎస్పి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కారణం నాయిని ఈశ్వర్

Date : 17 June 2023 08:34 PM Views : 360

Famous TV - తెలంగాణ / సంగారెడ్డి : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎ.నట్రాజ్ అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో నేడు జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఎస్పీ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి కరణం నాయిని ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయని, రాబోయే ఎన్నికల్లో బిఎస్పి కీలకంగా మారనుందని, తన బలం చూపిస్తుందని కాబట్టి కష్టజీవులు, బహుజన సమాజం బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు ఆహర్నిశలు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పోరాటం చెయ్యాలని ఆదేశించారు. కేసీఆర్ మాటలు తప్ప చేసిందేమీ లేదని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని హెద్దవ చేశారు. అమ్ముడుపోని ఓటరు సమాజాన్ని నిర్మించడమే చేయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఏ.నట్రాజ్ నేతృత్వంలో జిల్లా పార్టీ, అసెంబ్లీ నియోజకవర్గ కమిటీల మార్పులు చేర్పులు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుంతపల్లి మల్లేశం గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకొని, జిల్లా కోఆర్డినేటర్ జనార్ధన్ తొలగించి, ఆస్థానంలో పిప్పట్పల్లి మోహన్ నియమించడం చేయడం, అందోల్ నియోజకవర్గం ఇంచార్జి యం.భుచ్చయ్య ను తొలగించి ఆస్థానంలో యం.డి.చాంద్ పాషా నియమించినారు. అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా పల్లె కుమార్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పటాన్చెరు అసెంబ్లీ అధ్యక్షులుగా న్యాయవాది శ్రీశైలంను నియమించడం జరిగింది. నూతనంగా ఎన్నిక కాబడినటువంటి నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించడం కోసం కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ డప్పు ప్రేమ్ కుమార్, జిల్లా కోశాధికారి జనార్ధన్, జిల్లా ప్రచార కార్యదర్శి ఈశ్వర్, అందోల్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ ముప్పారం ప్రకాశం, నారాయణఖేడ్ అసెంబ్లీ అధ్యక్షులు అశోక్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పస్కే కృష్ణ తదితర నాయకత్వం పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :