Famous TV - తెలంగాణ / : చౌటకూర్ మండలం వెంకట కిష్టాపూర్ గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి రథోత్సవ జాతర మహోత్సవంలో భాగంగా నేడు బహుజన్ సమాజ్ పార్టీ (బి. ఎస్.పి) ఆందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముప్పారం ప్రకాశంతో ధూప దీప నైవేద్యాలతో స్వామివారి పూజా కార్యక్రమాన్ని నిర్వహింపజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన బోనాల ఊరేగింపు కార్యక్రమంలో ప్రకాశం ప్రజలతో మమేకమైన తీరును ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నోల్ల కృష్ణారెడ్డి, పల్లె కుమార్ గౌడ్, చాకలి రాజు, బేగారి మొగులయ్య, ప్రేమ్ కుమార్, కిరణ్ కుమార్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV