Monday, 14 September 2026 06:23:43 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

హైదరాబాద్ వేదికగా ఈ రోజు WWE ఛాంపియన్

Date : 08 September 2023 08:48 PM Views : 512

Famous TV - క్రీడలు / Hyderabad : ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ పోరాటాలను టీవీల్లో చూసిన హైదరాబాద్ అభిమానులకు వీటిని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇప్పుడు లభించింది. హైదరాబాద్ వేదికగా ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్పెక్టాకిల్‌ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈసారి భారత రెజ్లర్లతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు 28 మంది బరిలో నిలిచారు. పలు టైటిళ్లు కొల్లగొట్టిన జాన్‌సేనా..ఫ్రీకిన్‌ రోలిన్స్‌ జతగా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరు గివోని విన్సీ, లుడ్విగ్‌ కైసర్‌తో తలపడనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్‌ టీమ్‌ టైటిల్‌ కోసం ఇండస్‌ షేర్‌,సంగా,వీర్‌,కెవిన్‌ ఒవెన్స్‌, సమి జైన్‌ మధ్య ఫైట్‌ జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ టైటిల్‌ కోసం నటాల్యతో రియా రిప్లే అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు డ్రూ మెక్‌లెట్రీ, షాంకీ, రింగ్‌ జనరల్‌ గుంతర్‌, జియోనీ విన్సీ కూడా బరిలో దిగనున్నారు. ఈ ఈవెంట్ కోసం బుక్ మై షోలో టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దాంతో, దాదాపు నాలుగు వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మొత్తం నిండిపోనుంది. ఈ పోటీలను సోనీ స్పోర్ట్స్ చానళ్లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :