Thursday, 30 July 2026 11:01:30 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జీవితంలో అయినా చదువులో అయినా క్రీడల్లో అయినా "గెలుపు సాధించినప్పుడే గుర్తింపు"

"గెలిచినపుడే చరిత్రలో నిలిచిపోతాం" మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా

Date : 29 July 2023 07:03 PM Views : 971

Famous TV - క్రీడలు / తిరుపతి : జీవితంలో అయినా చదువులో అయినా క్రీడలల్లో అయినా గెలుపు సాధించినప్పుడే గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు తెలిపారు. తిరుపతి శ్రీ శ్రీనివాస కాంప్లెక్స్ లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అకాడమీ మరియు శాప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ గెలవడానికి చిత్తశుద్ధిగా కష్టపడి ప్రాక్టీస్ చేసి పోటీ పడితే, గెలుపు అటూ ఇటూ కావచ్చు, కానీ కొందరికి ముందుకు రావచ్చు, మరి కొందరికి లేటుగా రావచ్చు కానీ గెలుపు అనేది పక్కాగా వస్తుందని, గెలిచినప్పుడు చరిత్రలో నిలిచి పోతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో విజేతలకు గ్రూప్ వన్ పోస్టులతో పాటు పలు అకాడమీలు నిర్మించి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.

తిరుపతి లో సీఎం కప్ క్రీడలని ఎంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో చిన్న పిల్లలు ఎంత పోటా పోటీగా ఆడారో చూశామని తెలిపారు. తల్లితండ్రులు ప్రోత్సహించడం వల్ల శాప్ సపోర్ట్ చేయడం వల్లక్రీడాకారులు రాణిస్తున్నారని చెప్పారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి "ఆడుదాం ఆంధ్ర" అనే కార్యక్రమం ద్వారా బ్యాడ్మింటన్ తో పాటు క్రికెట్ కబడ్డీ ఖో ఖో క్రీడలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోటీల ద్వారా 15,004 సచివాలయం పరిధిలో మరియు మండలాలు నియోజకవర్గం జిల్లా, రాష్ట్రస్థాయిలో 2 లక్షల 99 వేల మ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుందని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యూత్ ఐకాన్ కావడం వల్ల యువతలో, క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించే విధంగా శాప్ ద్వారాసపోర్ట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శిరీష గారు, చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: