Famous TV - కళలు / తిరుపతి : జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శక్రవారం శనివారం రెండు రోజులు ది. జూన్ 9,10 - 2023 న తమిళనాడు రాష్త్రం నాయకులు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రo నెల్లూరు, కృష్ణా జిల్లా నాయకుల మండల నాయకుల శిక్షణా తరగతులు తిరుపతిలోని A.G.S. కాలేజీ ఆవరణంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి అధ్యక్షతన జరిగినాయి. ఈ క్లాసుల కు ప్రిన్సిపాల్ గాతమిళనాడు రాష్ట్ర నాయకులు రవిచంద్ర గారు బాధ్యత వహించి రెండు రోజులు నిర్వహించడం జరిగినది. ఈ క్లాసులలో గ్రామ కమిటీ నిర్మాణం చేయడం మరియు అలిపిరి నుంచి తిరుమల ప్రతి పౌర్ణమికి పాదయాత్ర నిర్వహిస్తున్న జానపద వృత్తి కళాకారుల సంఘం మరియు హిందూ మహాసభ కమిటీలకు సంఘీభావంగా గ్రామాలలో కళాకారులు భక్తులు పాల్గొనే విధంగా చేయడం మరియు ప్రతి బృందం కనీసం వారానికి ఒక్కసారైనా భజన చేసే విధంగా ఆ భజన బృందం సభ్యులను చైతన్య పరచడం చేయాలని క్లాసుల్లో బోధించడం జరిగింది. క్లాసులు బోధించడానికి విచ్చేసిన జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ సభ్యులంతా ఐక్యంగా ఉంటే చాలా సమస్యలు పరిష్కరించు కోవచ్చని గతం నుండి అలా ఉన్నారు కాబట్టే 4 రాష్ట్రాలకు సంఘం విస్తరించిందని తెలిపినారు.
అలాగే సంఘం నాయకులు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమాన్విత విషయాలను తెలియపరచి ధర్మ ప్రచారం చేయడానికి భజన కళాకారులు సైన్యంలా పనిచేస్తున్నారని తెలిపినారు. ఈ శిక్షణా తరగతులు జయప్రదం చేయడానికి జానపద వృత్తి కళాకారుల సంఘం ఆఫీస్ కార్యదర్శి T. శ్రీరామ్, ADMS కిరణ్ బాధ్యత నిర్వహించగా సంఘీభావంగా హిందూ మహాసభ నాయకులు బాబు రాజేంద్రప్రసాద్ గారు, మూర్తి గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సహకరించడం జరిగినది. ఈ శిక్షణా తరగతులకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి, పెళ్లకూరు మండల అధ్యక్షుడు దామోదర నాయుడు గారు, నాయుడుపేట మండల అధ్యక్షుడు బాలకృష్ణ గారు, సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డి గారు, ముత్తుకూరు మండల అధ్యక్షురాలు అరుణ గారు, డక్కలి మండల అధ్యక్షుడు చెంచయ్య గారు, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల అధ్యక్షుడు నాగార్జున గారు, రొద్దo మండల అధ్యక్షుడు నారయనప్ప గారు, ధర్మవరం మండల నాయకులు మల్లన్న, చిత్తూరు జిల్లా పుంగనూరు మండల అధ్యక్షుడు నారాయణ గారు, కృష్ణా జిల్లా కార్యదర్శి P.V. సబ్రమన్యం గారు, తమిళనాడు రాష్ట్ర నాయకులు రవిచంద్ర రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV