Famous TV - సినిమా / : మనుషులకు మరణం ఉంటుంది. కళాకారులు మరణించినా చిరంజీవులే.లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తన జీవిత ప్రయాణం నుంచి సెలవు తీసుకుని భువి నుంచి దివికి వెళ్లి నేటికి ఒక సంవత్సరం అయ్యింది. బాలు మూడవ వర్ధంతి సందర్భంగా. సినీ సంగీత అభిమానులు, బాలు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక నివాళులర్పిస్తున్నారు. బాలుని జ్ఞాపకం చేసుకుంటూ.ఆయన పాడిన పాటల్లో తమకు ఇష్టమైనవాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఎస్పీబీ కోవిడ్ -19 తో పోరాడి సెప్టెంబర్ 25 2020 న మరణించారు.చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆగష్టు 2020 లో బాలసుబ్రమణ్యంకు కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స లో కరోనావైరస్ నెగటివ్ పరీక్షించినప్పటికీ. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించింది. చివరకు బాలు ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారు. ఈరోజు సెప్టెంబర్ 25, మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన పాటలు ట్రెండ్ అవుతున్నారు. ఆయన పాడిన పాలు హల్ చల్ చేస్తున్నాయి. పాటకు అంతం లేదు. ఇది మనతో ఎప్పటికీ ప్రయాణిస్తుంది.. మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు. మీ అమర స్వరం కాదు అంటూ అభిమానులు బాలుని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
Admin
Famous TV