Monday, 14 September 2026 06:26:29 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి

గుజ్జు పరిశ్రమలను తెరిపించండి

Date : 07 June 2025 08:36 PM Views : 591

Famous TV - వ్యాపారం / చిత్తూరు : ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి గుజ్జు పరిశ్రమలను తెరిపించండి తోతాపురిని కొనుగోలు చేయించండి మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడండి జిల్లా అధికారులకు సూచించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎంపీ దగ్గుమళ్ళ చిత్తూరు: మామిడి రైతుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు జిల్లా యంత్రాంగానికి ఓ ప్రకటనలో సూచించారు. గుజ్జు పరిశ్రమలను తెరిపించి, మామిడి రైతుల నుంచి తోతాపురిని కొనుగోలు చేయించి, వారికి నష్టం వాటిల్లకుండా చూడాలని జిల్లా అధికారులకు తెలియజేశారు. తోతాపురి మామిడి టన్నుకు రూ.. 12 వేల రూపాయలు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎంపీ దగ్గుమళ్ళ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తోతాపురి మామిడికి మద్దతు ధరను 12 వేల రూపాయలగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. శనివారం ఆయన హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని కొనియాడారు. ప్రభుత్వ ఆశయాన్ని అధికారులు పసిగట్టి, పక్వానికి వచ్చిన మామిడికాయలను మాత్రమే ప్రాసెసింగ్ కంపెనీలకు పంపించే అంశం పై మామిడి రైతులకు అవగాహన కల్పించడంలో హార్టికల్చర్, అగ్రికల్చర్, అసిస్టెంట్లు, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలోని ఏఏ గుజ్జు పరిశ్రమలు పనిచేస్తున్నాయనే రోజు వారి వివరాలను డిస్ప్లే చేయించాలని.., కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు దిగుమతి అయ్యే మామిడి రవాణాను రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా ఏర్పాటు చేసి, నియంత్రించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అదే సమయంలో ప్రాసెసింగ్ కంపెనీల వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసి, మామిడి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. అంతేకాకుండా మామిడి రైతుల నుంచి గుజ్జు పరిశ్రమలు తోతాపురిని కొనుగోలు చేయించడంతోపాటు, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం.., మామిడి రైతులకు మద్దతు ధరను ఇప్పించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని తెలిపారు. అప్పుడే మామిడి రైతులకు మేలు చేసిన వారి అవుతామని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :