Monday, 14 September 2026 07:18:47 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

రూరల్ పారిశ్రామికవేత్తలను గుర్తించేందుకు  'ది అమర రాజా బెటర్ వే అవార్డ్స్'ను ప్రారంభించిన అమర రాజా గ్రూప్స్

Date : 26 September 2023 07:42 PM Views : 784

Famous TV - వ్యాపారం / : తిరుపతి,26.09.2023 : 1.75 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ సంస్థ , అమర రాజా గ్రూప్, 'ది అమర రాజా బెటర్ వే అవార్డ్స్'ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను  భారతదేశం లో గ్రామీణ ప్రాంతాలకు చెంది , వినూత్న వ్యవస్థాపకత రంగంలో  ప్రత్యేకంగా నిలుస్తున్న అసాధారణ వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి, గౌరవించేలా రూపొందించబడ్డాయి. ‘మెరుగైన అవకాశాలకు మెరుగైన ప్రాప్యతను అందించే సంస్థలను నిర్మించడం ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి’ అంకితభావంతో కృషి చేస్తున్న వారిపై ఈ అవార్డులు దృష్టి కేంద్రీకరించాయి.   గ్రామీణ సాధికారత మరియు ఉపాధి కల్పనకు ప్రతి రూపం గా ఈ గ్రూప్ ఉంది, 'ది అమర రాజా బెటర్ వే అవార్డ్స్' సైతం,  నిరంతరం ఎక్కువ మంది వ్యక్తులకు మెరుగైన అవకాశాలను అందించడానికి , సరిహద్దులను  అధిగమించటం  మరియు కొత్త మార్గాలను రూపొందించడం వంటి గ్రూప్ యొక్క శాశ్వత గుర్తింపుతో ప్రతిధ్వనిస్తాయి. తమ పట్టణ సహచరులతో పోల్చితే, గ్రామీణ ప్రాంత పారిశ్రామికవేత్తలు, మద్దతు మరియు ప్రోత్సాహం పరంగా  తరచుగా సమాజంలోని అన్ని వర్గాల నుండి అవరోధాలను ఎదుర్కొంటారు. భారతదేశం లో  60 మిలియన్లకు పైగా గ్రామీణ పారిశ్రామికవేత్తలు వున్నారని ఒక  అంచనా.  వీరిలో చాలామంది  పరిమిత వనరులు  మరియు సరైన  మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల  తమ  వినూత్న  ఆలోచనలకు వాస్తవ రూపం అందించటంలో అవరోధాలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవస్థాపకులు బుద్ది కుశలత  ప్రదర్శించడమే కాకుండా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన మరియు సమాజ పురోభివృద్ధిని నడిపించడంలో అనివార్యమైన పాత్రనూ  పోషిస్తున్నారు.   ఈ అవార్డు ల కోసం  దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించబడింది, దరఖాస్తు ను సమర్పించటం కోసం గడువు 31 అక్టోబర్ 2023 గా నిర్ణయించటం జరిగింది.  న్యాయ నిర్ణేతల బృందం ఈ సంస్థలను వారి సామాజిక మరియు సమాజ ప్రభావాన్ని, అలాగే స్థానిక ఉపాధి అవకాశాలను సృష్టించడంలో వారి పాత్రను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మూల్యాంకనం చేస్తుంది. విజేతలను డిసెంబర్ 1 నాటికి ప్రకటించనున్నారు మరియు డిసెంబర్ 20న అమర రాజా 38వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపికైన సంస్థలు, వ్యక్తులు తమ అవార్డులను అందుకుంటారు. అవార్డు కేటగిరీలు: • మహిళా ఉపాధి కోసం అమర రాజా బెటర్ వే అవార్డు • గ్రామీణ ఆదాయ ఉత్పత్తికి అమర రాజా బెటర్ వే అవార్డు • ఉత్తమ వ్యవసాయ ఆధారిత వ్యాపారానికి అమర రాజా బెటర్ వే అవార్డు అర్హత ప్రమాణం: • తప్పనిసరిగా నమోదిత మరియు గుర్తింపు పొందిన వ్యాపార సంస్థ అయి ఉండాలి • మార్కెట్‌లో తమ ఉత్పత్తులు/సొల్యూషన్‌లు/సేవలను అందించాలి • స్థానిక కమ్యూనిటీలకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి • గత 3 సంవత్సరాలలో క్లీన్ ఫైనాన్షియల్ రికార్డ్ కలిగి ఉండాలి • తాజా ఆర్థిక ఆడిట్ స్టేట్‌మెంట్‌ను అందించడం, సహేతుకమైన రాబడి వృద్ధిని ప్రదర్శించడం మరియు గణనీయమైన సామాజిక ప్రభావం కోసం సంభావ్యతను ప్రదర్శించడం అవసరం ఈ అవార్డులను ప్రకటిస్తూ, అమర రాజా గ్రూప్  కో-ఫౌండర్ మరియు చైర్మన్ శ్రీ జయదేవ్ గల్లా మాట్లాడుతూ, “రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు, అవార్డు విజేతలు ఒక సంవత్సరం పాటు  వ్యాపార అభివృద్ధి, ఆర్థిక, సప్లయ్‌ చైన్  మరియు మానవ వనరులు తో సహా సమగ్ర మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హత  పొందుతారు. విజేతలు తమ విజయ పథాన్ని కొనసాగించడంలో సహాయపడటానికి కొనసాగుతున్న మద్దతు మరియు మార్గదర్శకత్వం కూడా విస్తరించబడుతుంది. భౌగోళిక హద్దులు ద్వారా అవకాశాలు పరిమితం కానట్టి  భారతదేశాన్ని సృష్టించాలని మేము ఆశిస్తున్నాము.." అని అన్నారు.  అర్హత గల వ్యక్తులు/సంస్థలు www.amararaja.com/about/amararaja-awardsలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Famous Tv

Admin

Famous TV

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: